Abhi9 News - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ వెంటనే వెనకాల వస్తున్న మరో లారీ ఆగిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వెనుకభాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు మరణించారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు, వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి.
Admin
Abhi9 News