Wednesday, 07 January 2026 08:49:38 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

విబేధాల‌తో అత‌న్ని దూరం పెట్టాను

ఆ త‌ర్వాత మ‌ర‌ణించాడ‌ని తెలిసి షాక‌య్యా: అనుప‌మ‌

Date : 21 September 2025 10:23 AM Views : 94

Abhi9 News - సినిమా / Hyderabad : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోను సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. రీసెంట్‌గా కిష్కింద‌పురి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన ‘కిష్కిందపురి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్ సక్సెస్‌ను నమోదు చేసింది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు భారీగా ఆదరించారు. ఇప్పటివరకు ఈ మూవీ రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌గా చేరిపోయింది. సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఇటీవల నిర్వహించిన ‘కిష్కిందపురి’ సక్సెస్ మీట్ లో అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ, తన జీవితంలోని ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించగా, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాకు ఓ క్లోస్ ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం మనస్పర్థల వల్ల అతనితో మాట్లాడటం మానేశాను.ఆ తర్వాత‌ అతను పంపిన మెసేజ్‌లకు స్పందించలేదు. రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడన్న వార్త విని షాక్ అయ్యాను. మనతో ఉన్న వారితో తక్కువగానైనా మాట్లాడాలి, ప్యాచ్ అప్ కావాలి. లేకపోతే జీవితాంతం బాధే మిగిలిపోతుంది అంటూ అనుపమ భావోద్వేగానికి లోనయ్యారు. కిష్కిందపురి మూవీ విష‌యానికి వ‌స్తే.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కౌశిక్ పెగాళ్ళపాటి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. హారర్ – మిస్టరీ థ్రిల్లర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ శక్తివంతమైన నటనతో అలరించగా, బెల్లంకొండ శ్రీనివాస్ కొత్తగా ట్రై చేసిన పాత్రకు మంచి ఆదరణ లభించింది. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ వర్క్‌ సినిమాకి పెద్ద ప్లస్‌గా నిలిచాయి.సినిమా విడుదలైన 10 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ₹25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి కొట్టింది. వివిధ ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలు, పాజిటివ్ మౌత్ టాక్, యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ ఈ విజయానికి కారణమయ్యాయి.

abhi9 news

Admin

Abhi9 News

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :