Saturday, 13 June 2026 05:11:04 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలు

విజేతలకు భారీగా ప్రైజ్‌మనీ.. దరఖాస్తు, అర్హతల వివరాలివే

Date : 16 September 2025 08:14 PM Views : 166

Abhi9 News - కళలు / Hyderabad : బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్ ను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. త్వరలోనే ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ‌లోని యువ కళాకారులకు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వ‌హించ‌నుంది. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు. ఈ పోటీలకు సంబంధించిన అర్హతలు : 1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. 2. వీడియో 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి. 3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి. 4.మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. 5.బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి పోటీల్లో ఎంపికైన విజేతలకు ప్రైజ్ మనీ ఇలా.. ప్ర‌థ‌మ బ‌హుమ‌తి – రూ.3 ల‌క్షలు ద్వితీయ బ‌హుమ‌తి – రూ.2 ల‌క్ష‌లు తృతీయ బ‌హుమ‌తి – రూ.1 ల‌క్ష‌ కన్సోలేష‌న్ బ‌హుమ‌తి – రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు. నిర్దేశిత గడువులోగా వచ్చిన‌ ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపిక‌లు పూర్తి చేస్తుంది. ఎంట్రీల‌ను youngfilmmakerschallenge@gmail.com కు పంపగలరు (లేదా) వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి. ఎంట్రీల‌ను పంపించేందుకు తుది గ‌డువు సెప్టెంబ‌రు 30, 2025గా నిర్ణయించారు.

abhi9 news

Admin

Abhi9 News

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :